‘దిగ్విజయ్‌సింగ్
రాహుల్‌గాంధీకి సలహాదారు. అధిష్టానానికి చాలా దగ్గరగా ఉంటారు. తెలంగాణ
విషయంలో దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు నిజమే కావొచ్చు. తెలంగాణ సమస్య
పరిష్కారం కోసం రెండవ ఎస్సార్సీ వేస్తారనే అనుకుంటున్నా. దేశవ్యాప్తంగా
వస్తున్న పలు రాష్ట్రాల డిమాండ్లకు ఎస్సార్సీతో పరిష్కారం లభిస్తుంది’
అని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేసి
ఉంటే తెలంగాణ వచ్చేది. కానీ అలా చేయకుండా ప్రభుత్వాన్ని, సామాన్యులను
ఆందోళనల పేరుతో వేధించారు. సర్కారును అస్థిరపరిచేలా సింగిల్ పాయింట్
కార్యక్రమాన్ని నిర్వహించారు అని అన్నారు.
దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల డిమాండ్ పరిష్కారానికి ఎస్సార్సీని
ఏర్పాటు చేయడమే కాంగ్రెస్ వైఖరి అంటూ ఆ పార్టీ సీనియర్ నేతలు
దిగ్విజయ్‌సింగ్, రషీద్ అల్వీలు చేసిన వ్యాఖ్యలు నిజమే అయి ఉండొచ్చని
అభిప్రాయపడ్డారు.
No comments:
Post a Comment
Thank you for your comment