కర్ణాటక
మాజీ మంత్రి, గాలి జనార్ధన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు శ్రీరాములు
బీజేపీకి గుడ్ బై చెప్పారు. నవంబర్ 30 తేదిన జరుగనున్న ఉప ఎన్నికలో పోటీ
గురించి చంచల్‌గూడలోని గాలిని మంగళవారం సంప్రదించి నిర్ణయం తీసుకున్నారు.
తన రాజీనామ లేఖను జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, రాష్ట్ర అధ్యక్షుడు
ఈశ్వరప్పకు పంపారు.
బళ్లారి రూరల్ లో జరుగుతున్న ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా
నామినేషన్‌ను దాఖలు చేశారు. అక్రమ గనుల కేసులో చంచల్ గూడ జైలులో గడుపుతున్న
గాలి సోదరులు శ్రీరాములును పార్టీకి రాజీనామా చేయించడం ద్వారా బీజేపీ
అధిష్టానంపై తమ వ్యతిరేకతను వెల్లడించినట్లయింది.
No comments:
Post a Comment
Thank you for your comment