టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను టీడీపీ ఎమ్మెల్యేలు
హన్మంత్ షిండే, జైపాల్ యాదవ్, సుద్దాల దేవయ్య ఖండించారు. తాము పార్టీని
వీడేది లేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ లోనే కాదని, తాము ఏ పార్టీలోనూ
చేరేది లేదని, తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని హన్మంత్ షిండే
తెలిపారు. టీడీపీని వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని
అచ్చంపేట ఎమ్మెల్యే పి. రాములు తెలిపారు. వేరే పార్టీలో చేరబోనని ఆయన
స్పష్టం చేశారు. పార్టీలో ఉంటూనే తెలంగాణ కోసం పోరాడతానని చెప్పారు.
చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతంతో విసిగిపోయిన వీరు తెలంగాణ రాష్ట్ర
సమితిలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
No comments:
Post a Comment
Thank you for your comment