‘ ఇది గ్లామర్ ప్రపంచం. ఇందులో గ్లామర్ వున్నంత కాలం మాత్రమే రాణించగలం. వయసు మీదపడ్డాక కూడా నటించాలన్న
కోరిక నాకు లేదు. నాకు తెలిసి ఇంకో ఐదారేళ్ళు మాత్రమే నటిగా కొనసాగుతానను
కుంటున్నా. ఆ తర్వాత నటనకు గుడ్‌బై చెప్పేస్తా’ అంటోంది బాలీవుడ్ నటి కరీనా
కపూర్.
గ్లామర్ వున్నప్పుడే అందినంతా దండుకోవాలన్న సామెతని కరీనాకపూర్ బాగా
వంటి బట్టించుకున్నట్టుంది. ఈ మధ్య ‘బాడీగార్డ్’, ‘రా.వన్’ చిత్రాలతో
బాలీవుడ్ కథానాయికల్లో నెంబర్‌వన్ అనిపించుకున్న కరీనా ప్రస్తుతం
ఐశ్వర్యారాయ్ నటించాల్సిన ‘హీరోయిన్’ చిత్రంలో నటిస్తూ అందిన అవకాశాన్ని
సద్వినియోగం చేసుకుంటోంది. అందుకే వచ్చిన ఏ అవకాశాన్నీ వదులు కోవాలనుకోవడం
లేదు, పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో
కథానాయికగా నెంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నందుకు ఆనందంగా వుంది. ఆ
స్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం నా వంతు కృషి చేస్తున్నాను అని తెలిపింది
కరీనా కపూర్.
No comments:
Post a Comment
Thank you for your comment