టీఆర్‌ఎస్ లోకి మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు చేరనున్నట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం
టీఆర్‌ఎస్ అధ్యక్షులు కె.చంద్రశేఖర్‌రావుతో రహస్యంగా వీరంతా
సమావేశమైనట్లుగా సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు
పి.రాములు, జైపాల్ యాదవ్, నిజామాబాద్ జిల్లాకు చెందిన హన్మంత్‌రావు షిండే,
కరీంనగర్ జిల్లాకు చెందిన సుద్దాల దేవయ్య కేసీఆర్‌ను కలిసినట్లు టీఆర్‌ఎస్
వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న రెండుకళ్ల
సిద్ధాంతంతో నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి లేదనే ఉద్దేశంతో వారు
టీఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే
టీడీపీ వర్గాలు దీనిని ఖండిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు
పార్టీని వీడి పోయారు. మరో నలుగురు వెళితే తెలంగాణలో టీడీపీకి గడ్డు
పరిస్థితులే మిగులుతాయి.
No comments:
Post a Comment
Thank you for your comment