Wednesday, November 16, 2011

నవంబర్ 16న గూగుల్ మ్యూజిక్ స్టోర్

Google Music
ఎప్పటి నుండో ఊరిస్తున్న సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ కొత్తగా మార్కెట్లోకి గూగుల్ మ్యూజిక్ స్టోర్‌ని సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్ గూగుల్ ప్లస్‌తో అనుసంధానం చేసి విడుదల చేయనుంది. ప్రస్తుతం గూగుల్ తనయొక్క మ్యూజిక్ బ్లాగ్స్ ద్వారా లిమిటెడ్ మ్యూజిక్‌ని డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటుని కల్పించడం జరుగుతుంది.

ఎవరైతే గూగుల్ బీటా యూజర్స్ ఉన్నారో వారి కొసం ప్రత్యేకంగా రూపొందించిన గూగుల్ మ్యూజిక్ లాకర్ సర్వీస్ ద్వారా క్లౌడ్ ఆధారిత ఎమ్‌పి3 సాంగ్స్‌ని 20జిబి వరకు డౌన్ లోడ్ చేసుకొవచ్చు. గూగుల్ కొత్తగా ప్రారంభించనున్న ఈ మ్యూజిక్ స్టోర్స్ ద్వారా యూజర్స్‌కు సెక్యూరిటీ కలిగిన మ్యూజిక్‌ని అందించడమే కాకుండా, లైసెన్సింగ్ డీల్స్‌ని కూడా ప్రవేశపెట్టనుంది.

ఇలా చేయడం వల్ల ప్రస్తుతం మార్కెట్లో ఐట్యూన్స్, ఫేస్‌బుక్ ప్రెండ్లీ స్పోటిపై‌కి గట్టి పోటీనిస్తుందని గూగుల్ ప్రతినిదులు భావిస్తున్నారు. గూగుల్ మ్యూజిక్ స్టోర్ కి సంబంధించిన సమాచారాన్ని అంతటిని కూడా నవంబర్ 16న జరిగే “These Go to Eleven” ఈవెంట్‌లో వెల్లడించనున్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment