ఇక నుంచి పాజిటివ్ థింకింగ్ పాఠాలు నేర్చుకోవడానికి ఎక్కడికో
వెళ్లక్కర్లేదు. మన జగనన్న దగ్గరకు వెళితే చాలు. సీబీఐ కేసులు, ఐఏఎస్
అధికారులను కూడా వదలకపోవడం, స్పీకర్ రాజీనామాలు ఆమోదిస్తుండటం వంటి సంఘటనల
నేపథ్యంలో జగన్ వర్గంలో తిరుగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెనుకడుగు
వేశారు. తటస్థంగా ఉండటమో, తిరిగి కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా
పాల్గొనడమో చేస్తున్నారు. ఈ విషయం గురించి గుంటూరు జిల్లాలో మలివిడత
ఓదార్పుయాత్రలో పరోక్షంగా జగన్ వ్యాఖ్యానించారు.
“ఎమ్మెల్యేలు వెంటలేకపోయినా రాష్ట్రమంత కుటుంబం తనకు తోడుగా ఉంద”ని
అన్నారు. ఓ తల్లిని, బిడ్డను ఎదుర్కొనేందుకు ఇన్ని కుట్రలు, కుతంత్రాలు
అవసరమా అని ఆవేదనాగ్రహాలతో కూడిన వ్యాఖ్యలు చేశారాయన.
చరిత్రలో విరుద్ధమైన విషయాలన్నీ జరుగుతున్నాయని, ప్రజా సమస్యల విషయంలో
ఏకం కావాల్సిన నేతలు తన కుటుంబ ప్రతిష్టను పాడుచేయడానికి ఏకం కావడం
విడ్డూరం అన్నారు. “చంద్రబాబునాయుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9, కాంగ్రెస్
పార్టీ అంతా ఒకటై దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని కేసుల్లో ఇరికించే
చేస్తుంటే…” ఒక్కడిని కట్టడి చేయడానికి ఇంతమందా అని జనమే ఆశ్చర్యంతో
చూస్తున్నారని జగన్ అన్నారు. సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment
Thank you for your comment