తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జీవిత కథ ఆధారంగా ‘చాకలి ఐలమ్మ’ పేరుతోనే ఓ చిత్రం
రూపొందనుంది. ప్రీతీనిగమ్ ప్రధాన పాత్రధారిణిగా నటిస్తున్న చిత్రం
షూటింగ్ హైదరాబాద్ లో మొదలయింది. మిరియాల రవీందర్ దర్శకత్వంలో కె.నాగమణి,
గుర్రపు విజయ్‌కుమార్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ముహూర్తపు దృశ్యానికి
చాకలి ఐలమ్మ మనవడు చిట్యాల రామచంద్రం కెమెరా స్విచాన్ చేయగా, ఎమ్మెల్సీ
దిలీప్‌కుమార్ క్లాప్ ఇచ్చారు.
‘‘తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకుంటున్న వారందరికీ ఈ సినిమా ఓ
కనువిప్పు లాంటిది’’ అని దర్శకుడు మిరియాల రవీందర్ అన్నారు. తెలంగాణ రైతాంగ
పోరాటంలో వీరోచిత పోరాట పటిమను కనబరిచిన ఐలమ్మ జీవితం భావితరాలకు
స్ఫూర్తిదాయకమని రామచంద్రం చెప్పారు. ఐలమ్మ పాత్రలో నటించడం అదృష్టంగా
భావిస్తున్నానని ప్రీతీనిగమ్ చెప్పారు.
ఈ నెల 26 నుంచి వరంగల్‌లో తొలి షెడ్యూల్ చేస్తామని, ఖమ్మం, మణుగూర్
తదితర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్ ఉంటుందని నిర్మాతల్లో ఒకరైన విజయ్‌కుమార్
తెలిపారు. రాఖీ, బండారి మువ్వ, రమేష్, బయ్యారం వీరన్న, హరిలక్ష్మి, యేరీ
లక్ష్మీదేవి, దేవదానం యేసోట్ నరేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ
చిత్రానికి సంగీతం: రమేష్ ముక్కర, కెమెరా: కోట తిరుపతిరెడ్డి, చీఫ్
కో-డెరైక్టర్: మువ్వ.
No comments:
Post a Comment
Thank you for your comment