Wednesday, November 16, 2011

నవంబర్ 18న ముంబై యూనివర్సిటీలో వీకిపిడియా కాన్పరెన్స్

Wikipedia
భారతదేశంలో వీకిపిడియా మొట్టమొదటి సారి ఆఫీసుని ప్రారంభిస్తునందుకు గాను ముంబైలో నవంబర్ 18న మూడు రొజుల అతిపెద్ద కాన్పరెన్స్‌ని ఏర్పాటుచేయనుంది. ఈ కార్యక్రమానికి వీకిపిడియా వ్యవస్దాపకుడు జిమ్మీ వేల్స్ ముఖ్య అతిధిగా రానున్నారు. ఇండియాలో జరిగే వీకి కాన్ఫరెన్స్‌కి జిమ్మీ వేల్స్ రావడం ఇదే మొదటి సారి.
 
ఇక ఈ కార్యక్రమాన్ని ముంబైలో ఉన్న చారిత్రాత్మక యూనివర్సిటీ(ముంబై యూనివర్సిటీ)లో ఉన్న ఫోర్ట్ క్యాంపస్‌ కన్వెక్షన్ హాలులో నిర్వహించనున్నారు. ఈ సందర్బంలో వీకిపిడియా ప్రెసిడెంట్ అర్జున్ రావ్ చావ్లా మాట్లాడుతూ ఈ వీకి కాన్పరెన్స్‌ని ఇంత మెగా ఈ వెంట్‌గా నిర్వహించడానికి గల కారణం, భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ భాషలను ఒకతాటి మీదకు తీసుకొని రావడం కలిగే ప్రయోజనాలు ప్రజలకు వివరించడం జరుగుతుంది. దేశం మొత్తం మీద ఉన్న 20 ప్రాంతీయ భాషలకు సంబంధించి సమాచారాన్ని రాబోయే భావితరాలకు ఎలా భద్ర పరచాలో తెలియజేయడం జరుగుతుంది.

వీకికాన్పరెన్స్ ఇండియా కార్యక్రమాన్ని ఆర్గజైన్ చేస్తున్న ఛైర్ పర్సన్ ప్రణవ్ కురమ్‌సే మాట్లాడుతూ ఇలాంటి గొప్ప కార్యక్రమాలను ఇండియాలో నిర్వహించడం మాకు చాలా సంతోషాన్ని కలగజేసే అంశం అని అన్నారు. వీకిపిడియా వ్యవస్దాపకుడు జిమ్మీ వేల్స్ ఆలోచన రూపమే ఈ వీకి కాన్పరెన్స్ అని అన్నారు. ఇక గతంలో వన్ ఇండియా వీకిపిడియా ఇండియా ఆఫీసుని ఇండియాలో ప్రవేశపెట్టనున్న ఆర్టికల్ ప్రత్యేకంగా మరలా మీకు గుర్తు చేయడం జరుగుతుంది. వీకిపిడియాని ప్రారంభించిన తర్వాత 2009వ సంవత్సరంలో 340 మిలియన్ రీడర్స్ ఉండగా, ఇప్పుడు ఇండియాలో ప్రతిరోజూ రీడర్స్ సంఖ్య 420 మిలియన్లకు చేరుకుంది.

No comments:

Post a Comment

Thank you for your comment