Wednesday, November 16, 2011

తెలుగు వాడుక పదకోశం (Telugu words)

తెలుగు భాష అభివృద్ధికి ఈనాడు తదితర పత్రికలన్నీ నూతన పద కల్పన లోనూ, తెలుగు పదాల ప్రాచుర్యం లోనూ హర్షించదగ్గ కృషి చేస్తున్నాయి. మన భావవ్యక్తీకరణకి సరైన తెలుగు పదం సమయానికి గుర్తు రాకపొవడం తరచూ చాలామందికి అనుభవమే. ఈ చిన్న సమస్యకి సమాధానంగా ఈ పదాల మాలిక కూర్చే ప్రయత్నం. ఈ పదాలన్నీ నిత్యజీవితం లో వార్తాపత్రికల్లో కనిపించేవే. కాకపోతే ఇక్కడ ఒక మాలిక లాగా కూర్చే ప్రయత్నం చేస్తున్నా... ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే అడగవచ్చు. ఈ మాలిక కూర్పుకి సాయం కూడా చేయవచ్చు. (తెలుగులో రాయడానికి లేఖిని ని వినియోగించండి.  లేఖిని వెబ్ చిరునామా www.lekhini.org  )
అభినందనలతో ఇక ముందుకు......

23-06-2011
కాంట్రాక్టర్ = గుత్తేదారు, కాంట్రాక్టు = గుత్త
ఫైలు = దస్త్రం 
job = కొలువు 
campus selections =  ప్రాంగణ నియామకాలు 

24-06-2011


interview (eg. interview of Finance Minister in the media) = పరిచయ కార్యక్రమం
interview (eg. Civil Services interview) = మౌఖిక పరీక్ష

Analytic = విశ్లేషణాత్మక

Descriptive = వివరణాత్మక

Meet (eg. UN General Body meet ) = సదస్సు


Telephone  ని దూరవాణి అనడం వినే ఉంటారు.. మరి Mobile phone  ని ఏమంటారు? 
సంచార వాణి అని ఒక ఔత్సాహకుడి అనువాదం.. అయితే ఇంకా ప్రాచుర్యం పొందలేదు.

07-07-2011


internet =  అంతర్జాలం
Broadcast (used for Radio) = ప్రసారం
Telecast (used for TV) = ప్రసారం
Live telecast = ప్రత్యక్ష ప్రసారం

scope ( eg. micro scope) అనే పదాన్ని దర్శిని అని అనువదిస్తారు
micro scope = సూక్ష్మదర్శిని
tele scope = దూరదర్శిని

endo scope ( used for viewing the internal parts of abdomen) = కుహరాంతరదర్శిని అని ఒక ఔత్సాహకుడి అనువాదం.. అయితే ఇంకా ప్రాచుర్యం పొందలేదు

No comments:

Post a Comment

Thank you for your comment