Add caption |
గనుల
లీజుల్లో అక్రమాలకు పాల్పడి గాలి జనార్ధన్ రెడ్డికి సహకరించినట్టు ఆరోపణలు
ఎదుర్కొంటున్న సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి తన ఉద్యోగానికి
రాజీనామా చేసినట్లు సమాచారం. చెన్నైలోని తన సోదరుని నివాసంలో అనారోగ్యంతో
ఉన్న శ్రీలక్ష్మి ఈ మేరకు రాజీనామా లేఖను సాధారణ పరిపాలన శాఖ ముఖ్య
కార్యదర్శి అజయ్ మిశ్రాకు మంగళవారం సీల్డ్ కవర్ ద్వారా పంపినట్లు
తెలుస్తోంది.
మరోవైపు గనుల లీజుల వ్యవహారంలో విచారణకు హాజరుకావలసిందిగా సిబిఐ
జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ శ్రీలక్ష్మిని ఆదేశించారు. ఈ నెల 29
వరకు సెలవుకు దరఖాస్తు చేసుకున్న శ్రీలక్ష్మి చెన్నైలో ఉన్న సమాచారం
అందుకున్న సిబిఐ పోలీసు బృందం మంగళవారం సాయంత్రం అక్కడికి బయలుదేరి
వెళ్ళినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సిబిఐ అధికారులు తన కోసం చెన్నై
వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న శ్రీలక్ష్మి ఈలోపే ఓ ప్రత్యేక ప్రతినిధి
ద్వారా తన రాజీనామా లేఖను పంపించారని సమాచారం.
కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ బాధ్యతల నుండి ప్రభుత్వం మంగళవారమే
తప్పించింది. ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంలో శ్రీలక్ష్మిని ముద్దా యిగా
పేర్కొంటూ సిబిఐ ఇప్పటికే ప్రకటించింది. ఓ వైపు రాజీనామా లేఖను
హైదరాబాద్‌కు పంపడం, మరోవైపు శ్రీలక్ష్మి కోసం సిబిఐ బృందం చెన్నై బయలుదేరి
వెళ్ళడంతో మైనింగ్ విచారణ ఆసక్తికరంగా మారింది.
No comments:
Post a Comment
Thank you for your comment