అమెరికా
అధ్యక్షుడు బరాక్ ఒబామాకు బంపర్ అఫర్ తగిలింది. ఒబామాకు ‘క్రొకడైల్
అటాక్ ఇన్సురెన్స్ పాలసీ’ని ఒక కంపెనీ అందజేయనుంది. ఈ పాలసీ కింద
ప్రమాదవశాత్తు మొసళ్లు అధ్యక్షునిపై దాడి చేస్తే 50,870 అమెరికా డాలర్లను
నష్టపరిహారంగా చెల్లిస్తామని కంపెనీ తెలిపింది. ఈ అద్భుతమైన పాలసీని ఒబామా
లాంటి ప్రముఖులకు ఇచ్చేందుకు ఆతృతగా వేచిచూస్తున్నామని ఆ కంపెనీ చీఫ్
ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ హార్డింగ్ అన్నారు. ఈ మొసళ్ల బీమా 20ఏళ్ల పాటు
ఉంటుందని ఆయన తెలిపారు
ఆస్ట్రేలియాలో అటవీ ప్రాంతం, మొసళ్లు ఎక్కువగా ఉండే డార్విన్ పట్టణం,
రాజధాని కాన్‌బెర్రా ప్రాంతాలలో ఒబామా రెండు రోజుల పాటు పర్యటిస్తారు.
అందుకే ఒబామాకు కంపెనీ పాలసీని అందించేందుకు రెడీ అవుతోంది.
No comments:
Post a Comment
Thank you for your comment