ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుతంగా ఉద్య మాలు జరుగుతుంటే పోలీస్ బలగా లను దింపి
అక్రమ అరెస్టులతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆపలేరని తెలంగాణ ప్రజాప్రంట్
చైర్మెన్ గద్దర్ అన్నారు. 9వ జాతీయ రహదారి దిగ్బంధం కేసులో అరెస్ట్ అయి
జిల్లా కేంద్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టిఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో
సభ్యులు చెరుకు సుధాకర్‌ను నల్లగొండ ఆయన ఆసు పత్రిలో పరామర్శించారు.
ముఖ్యమంత్రి, కలెక్టర్ స్పం దించి తెలంగాణ వాదులపై అక్రమంగా పెట్టిన
కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తుపాకులతో ఉద్యమాన్ని
ఆపలేరని, తెలంగాణ ఉద్యమం న్యాయమై నది, మహౌన్నతమైనదని అన్నారు. ప్రత్యేక
తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించకపోతే జాతీయ రహదా రులపై గుడిసెలు వేస్తామని
హెచ్చరించారు. తెలంగాణను అడ్డుకునేందుకు ఢిల్లీలో కుట్రపూరితమైన చర్చలు
చేపడుతున్నారని ఆరోపించారు.
No comments:
Post a Comment
Thank you for your comment