రాష్ట్రంలో భవిష్యత్ ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అనకాపల్లి ఎంపి సబ్బం హరి అన్నారు.
తాను ఎంపిగా ఎన్నికై ఢిల్లీ వెళ్లిన తరువాత కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం
తెలుసుకున్నానని, రాష్ట్ర మంత్రిగా ఉండి ఉంటే కాంగ్రెస్ మంత్రిగా
ఉండిపోయేవాడినని అన్నారు. ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు మాజీలుగా
మిగిలే కాలం దగ్గర్లోనే ఉందని అన్నారు.
బాబు ఆస్తులపై ప్రాథమిక విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హైకోర్టు
ఇచ్చిన తీర్పును యనమల తప్పుపట్టడమే కాక, ఇది టీడీపీ ప్రతిష్టకు సంబంధించిన
విషయమని చెప్పడం చూస్తే అప్పీలుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు స్పష్టం
అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి
గోవర్థన్ అన్నారు. ‘ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని
మీరూ, మేమూ కలిసి కూల్చేద్దాం, మీకు దమ్మూ ధైర్యం ఉంటే అవిశ్వాసం
పెట్టండి’ అని సవాల్ విసిరారు.
జగన్ తన బురదను బాబుకు అంటించాలని చూస్తున్నారని చెప్పడం సరికాదని ఆయన
అన్నారు. అసలు చంద్రబాబే బురద ఊబిలో కూరుకుపోయారని, ఇక వేరెవ్వరూ ఆయనకు
అంటించాల్సిన పనేలేదని ఆయన అన్నారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో చేసిన
అరాచకాలు, ఆయన బండారం సీబీఐ విచారణలో బయట పడుతుందని తాము భావిస్తున్నామని,
అందుకే టీడీపీ నేతలు అంతగా ఆందోళన చెందుతున్నారని అన్నారు.
No comments:
Post a Comment
Thank you for your comment