టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆస్తుల వ్యవహారంలో సీబీఐ విచారణకు
హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పార్టీ భవిష్యత్, చంద్రబాబు గౌరవానికి భంగం
కలగకుండా ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ నిర్ణయించుకుంది. రాజకీయ
దురుద్దేశంతోనే విజయమ్మ చంద్రబాబుపై హైకోర్టులో పిటీషన్ వేశారని టీడీపీ
నేతలు ప్రజలకు వివరించే పనిలో మునగనున్నారు. విజయమ్మ పిటీషన్‌లో పేర్కొన్న
అంశాలకు జవాబుగా 60 పేజీలతో కూడిన కరపత్రం విడుదల చేసేందుకు టీడీపీ
అధిష్ఠానం సిద్ధమవుతోంది.
ముఖ్యంగా పది అంశాలు ఈ కరపత్రంలో పొందుపర్చనున్నారు. జగన్ కాంగ్రెస్‌తో
మూడు ఒప్పందాలు చేసుకున్నాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్‌పై
సీబీఐ విచారణను నీరుగార్చడం, జగన్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం,
టీడీపీని నిర్వీర్యం చేయడం తదితర ఒప్పందాల్లో భాగంగానే విజయమ్మ బాబుపై
కోర్టులో పిటీషన్ వేసిందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ విషయాలను
ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలు నిర్ణయించారు.
No comments:
Post a Comment
Thank you for your comment