‘‘ఉత్తరాదికి చెందిన గ్రామీణ యువకులు, ముఖ్యంగా యుపి, బీహార్‌లకు చెందినవారు ఎంతకాలం ఉపాధి
కోసం మహారాష్ట్ర, పంజాబ్ తదితర ప్రాంతాలకు బిచ్చగాళ్లలా వలస పోవాలని’’
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ సోమవారం ఉత్తరప్రదేశ్
లోని ఫూల్పూర్ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఎంతో అవమానకరం అని ప్రతిపక్ష బిజెపి
అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఖండించారు. ఉపాధిని వెతుక్కొంటూ వలస
పోతున్నవారిని బిచ్చగాళ్లని అభివర్ణించినందుకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి
బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన మంగళవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన
పత్రికాగోష్ఠిలో డిమాండ్ చేశారు.
ఉపాధిని వెతుక్కొంటూ యుపియ, బీహార్ ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస
పోతుండడానికి కారణమెవరు?, ఈ రెండు రాష్ట్రాలనూ దాదాపు యాభై ఏళ్లకు పైగా
కాంగ్రెస్, దాని మిత్రపక్షాలే పాలించాయి, యుపి, బీహార్‌లు ఇంకా వెనుకబడి
ఉండడానికి కాంగ్రెస్ పార్టీయే కారణం అని జవదేకర్ ఆరోపించారు. బీహార్‌లో గత
ఏడేళ్ల ఎన్డీయఏ ప్రభుత్వ పాలనలో ఉపాధి అవకాశాలను బాగా మెరుగుపరిచిన
కారణంగా ప్రస్తుతం ఈ వలసలు తగ్గాయని బిజెపి నాయకుడు తెలిపారు.
No comments:
Post a Comment
Thank you for your comment