‘‘రాష్ట్ర విభజనపై పూటకో మాట వినపడుతోంది. ఒక వేళ చీల్చాల్సి వస్తే రాయలసీమను తెలంగాణలో
కలిపి రాయల తెలంగాణ ఇవ్వండి. లేదంటే మౌనంగా ఉండండి. హైదరాబాద్‌పైనా
ఎవరికివారు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాద్‌ను
కాపాడుకుంటాం. రాజధానిలో జీవిస్తున్న వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని
లేదు’’ అని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
అనంతపురం సప్తగిరి సర్కిల్‌లో ఎంఐఎం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన
మాట్లాడారు.
ముస్లిం విద్యార్థినులు విద్యాసంస్థలకు బురఖాలతో వెళితే అవమానించడం మంచి
పద్ధతి కాదని సూచించారు. కాంగ్రెస్, టీడీపీలకు ఓ పాలసీ లేదన్నారు.
మజ్లిస్‌కు మాత్రమే నిర్దిష్ట పాలసీ ఉందన్నారు. ఎవరు అధికారం
చెలాయించాలన్నా ముస్లిం భాగస్వామ్యం తప్పనిసరన్నారు. ఎన్నికల కోసమే
ముస్లింలను వాడుకుంటున్నారని, 2014లో తమ సత్తా ఏంటో చూపుతామన్నారు.
No comments:
Post a Comment
Thank you for your comment