కొందరికి
ఆమె చేష్టలు మొనాటనీగా ఉండొచ్చు. కానీ, ఇప్పటికీ ఆ బబ్లీ గర్ల్ అంటే
చాలామంది గుండెల్లో యువరాణి. ఆమె ఎవరో కాదు… ఆ చాలామందిలో ఒకడైన
బాలీవుడనటుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారుడైన రితేష్ దేశ్‌ముఖ్‌తో
ప్రేమలో పడిన జెనీలియా.
ప్రేమ చెట్టుకు పెళ్లి ఆకులు చిగురించాయి. ఇద్దరి ప్రేమకు ఆమోదం
సులువుగా దొరికింది. వ్యవహారం పెళ్లి వరకు వెళ్లింది. ఇరు కుటుంబాలు
సంతృప్తిగా పెళ్లికి అంగీకరించింది. 2012 ఫిబ్రవరి 4న పెళ్లి ఉంటుంది.
ఫిబ్రవరి 3,4,5 తేదీల్లో వివాహ వేడుకలు భూదేవి పందిరిగా జరగనున్నాయి.
కార్పొరేట్ కుటుంబం- రాజకీయ కుటుంబం ఇక ఇద్దరూ కలిస్తే పెళ్లి మామూలుగా
ఉంటుందా? పెళ్లి అంగరంగ వైభవమే.
పెళ్లితో తన సినిమా కెరీర్ ఆగదని జెనీలియా రితేష్ తో మాట తీసుకున్నట్లు
తెలిసింది. ఇది బాలీవుడ్ టాపిక్. ప్రస్తుతానికి పెళ్లి ని పూర్తి ప్రైవేటు
వ్యవహారంగా, అతి ముఖ్యమైన అతిథులతోనే నిర్వహించాలని భావిస్తున్నారట.
No comments:
Post a Comment
Thank you for your comment