అల్లరి నరేష్ తమిళంలో నటించిన చిరం తెలుగులో ‘సంఘర్షణ’ పేరుతో అను వాదమవుతోంది. ఇందులో
నరేష్‌తో పాటుగా శశి కుమార్, కలర్స్ స్వాతి, నివేద నటిస్తున్నారు.
తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీరంజిత్ మూవీస్, టింబూ ప్రొడక్షన్స్
సంయుక్తంగా హక్కులు పొందాయి. పి.సముద్రఖని దర్శకుడు. ఆదివారం హైద రాబాద్‌లో
ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అల్లరి నరేష్, నివేద, సముద్రఖని,
అమ్మిరాజు, దామోదర ప్రసాద్, టింబర్ తదితరులు పాల్గొన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ తమిళంలో, తెలుగులో శంభోశివశంభో చిత్రం చేశారు.
ఇప్పుడీ చిత్రాన్ని కష్టపడి తీశాను. శంభో శివ శంభో సినిమా సమయంలో అల్లరి
నరేష్ పరిచయం అయ్యారు. అప్పటి నుండి అతనితో సినిమా చేయాలనే ఆలోచనతో
ఉన్నాను. తమిళంలో తీస్తున్న ఈ చిత్రంలో నటించాల్సిందిగా కోరగానే నరేష్
అంగీకరించారు. తమిళంలో పోరాలి పేరుతో నిర్మించాను. అందరూ కష్టపడి నటించారు
అని పేర్కొన్నారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి
జీవితాన్ని ఎలా కొనసాగించాలనేది ఈ చిత్ర ఉద్దేశం. ప్రధమార్థం వినోదభరితంగా,
ద్వితీయార్థంలో సామాజికాంశాల గురించి చూపిచడం జరిగిందని తెలిపారు.
No comments:
Post a Comment
Thank you for your comment