రాష్ట్రావతరణ దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ నవంబర్ 1న నిరసనలు తెలపాలని
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. తెలంగాణ
సాధన కోసం అధిష్టానంపై ఒత్తిడి కొనసాగించాలని వారు నిర్ణయానికి వచ్చారు.
శుక్రవారమిక్కడ సమావేశమయిన ఎమ్మెల్యేలు పలు నిర్ణయాలు తీసుకున్నారు.
సకల జనుల సమ్మె కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జిల్లాలను కరవు జిల్లాలుగా ప్రకటించి ఆదుకోవాలన్నారు. సమ్మెకాలంలో తెలంగాణవాదులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రచ్చబండలో పాల్గొనే అంశంపై మరోసారి సమావేశమయి చర్చించాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారు.

No comments:
Post a Comment
Thank you for your comment