Friday, October 28, 2011

ముఖ్యమంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ





ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి బడుగు, బలహీన వర్గాల నేత కొండా లక్ష్మణ్ బాపూజీ తొలి ముఖ్యమంత్రి అయ్యేందుకు తమ వంతు కృషి చేస్తామని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఇందు కోసం అవసరమైతే అన్ని పార్టీల మద్దతు కోరుతామని తెలిపారు. 1969లో తెలంగాణకు జరిగిన ద్రోహానికి నిరసనగా కెబినెట్ హోదాలో ఉండి మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఎలాంటి పదవి తీసుకోకుండా రాజకీయాల్లో కొనసాగిన, నిజాయితీపరుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ ముఖ్యమంత్రి పదవికి అర్హుడని అన్నారు.  ఎస్సీల వర్గీకరణపై ప్రభుత్వం వచ్చే శీతకాల సమావేశంలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఎస్సీల వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. దొరల తెలంగాణ బదులు సామాజిక తెలంగాణ ఏర్పాటుకు ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతును ఇస్తుందని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నవంబర్ 1న జరిగే తెలంగాణ విద్రోహ దినం వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఢిల్లీలో తెలంగాణ కోసం కొండ లక్ష్మణ్ బాపూజీ దీక్షలు చేస్తున్నందున తెలంగాణ జిల్లాలోని మండలకేంద్రాల్లో ఎమ్మార్పీఎస్, దళిత, బడుగు, బలహీన వర్గాలు ఎక్కడికక్కడే దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

Thank you for your comment