Tuesday, October 25, 2011

సకలం (సమ్మె) ముగిసింది

సమ్మె ముగిసింది. ఎట్టకేలకు 42 రోజుల సుదీర్ఘ కాలం అనంతరం తెలంగాణ కోసం తలపెట్టిన సకల జనుల సమ్మె ముగిసింది. తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో జరిపిన చర్చలు ఫలించాయి. సమ్మె విరమించడానికి వారు అంగీకరించారు. ఈ చర్చలలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కూడా పాల్గొన్నారు. మొత్తం 9 అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి జెఎసి నేతలకు మధ్య ఒప్పందం కుదిరింది. రేపటి నుంచి విధులలో చేరేందుకు నేతలు అంగీకరించారు. సమ్మెను పూర్తిగా విరమించాలని తెలంగాణ ఉద్యోగసంఘాల ఐకాస నిర్ణయించింది. సమ్మె కాలంలో ఉద్యోగులపై విధించిన ‘ఎస్మా’ చట్టాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వం-ఉద్యోగసంఘాల ఐకాస ప్రతినిధులకు మధ్య జరిగిన చర్చల్లో ఉద్యోగసంఘాల తొమ్మిది డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది.
ఇవీ డిమాండ్లు
ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తీసుకునేందుకు అంగీకారం. 42 రోజుల సమ్మెకాలన్ని విశిష్టసెలవుగా పరిగణించడం.
సమ్మెకాలంలో జరిగిన బదిలీల ఉపసంహరణ వంటి కొన్ని విషయాలపై ప్రభుత్వం దిగొచ్చింది. దీంతో  సమ్మె విరమిస్తున్నట్టు తెలంగాణ ఉద్యోగసంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు సమ్మె విరమణ పత్రాలపై ప్రభుత్వ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంతకాలు చేశారు. రేపటి నుంచి అందరు ఉద్యోగులు విధులకు హాజరవుతారు. ప్రభుత్వ కార్యకలాపాలు యథావిధంగా పునరుద్ధరణ అవుతాయి.

No comments:

Post a Comment

Thank you for your comment