ఆమరణ దీక్ష ఆగదు : కోమటిరెడ్డి
తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి తీరుతానని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం
చేశారు. ఎంపీలు దీక్షను వాయిదా వేయాలని తనను కోరారని ఆయన తెలిపారు. అయితే
దీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని వారికి తేల్చిచెప్పానని చెప్పారు.
దీక్షకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలకు, ఉద్యోగ సంఘాలకు, తెలంగాణ వాదులకు ఆయన
కృతజ్ఞతలు తెలిపారు.
శుక్రవారం కోమటిరెడ్డితో సమావేశమయిన కాంగ్రెస్ ఎంపీలు దీక్ష చేపట్టవ్దని
ఆయనను కోరారు. అధిష్టానం తెలంగాణపై కసరత్తు చేస్తోందని, నవంబర్‌లో జరిగే
పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా మాట్లాడతామని కోమటిరెడ్డికి వారు
సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తి
లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.
No comments:
Post a Comment
Thank you for your comment