
బాన్సువాడ ఉప
ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు తనకు పడలేదని, వారు ద్రోహం చేశారని అన్న
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు సరికావని, తెలంగాణ రాష్ట్ర్ర
సాధన ఉద్యమానికి ఇలాంటి వ్యాఖ్యలు మేలు చేయకపోగా, కీడు చేస్తాయని సీపీఐ
రాష్ట్ర కార్యదర్శి నారాయణ సోమవారం కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో
పేర్కొన్నారు.
ఇలాంటి హెచ్చరికలు సరికాదని, పార్టీ అధ్యక్షుడుగా ఇటువంటి సంఘటనలు
తిరిగి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని కేసీఆర్ కు సూచించారు.
పోచారం వ్యాఖ్యలను తాను పలు పత్రికల్లో చూశానని, అలాంటి వ్యాఖ్యలు చేయడం
సబబు కాదని అన్నారు.
No comments:
Post a Comment
Thank you for your comment