Saturday, October 29, 2011

దాసరి సతీమణి పద్మ మృతి

ప్రముఖ దర్శక, నిర్మాత, కేంద్ర మాజీమంత్రి దాసరి నారాయణరావు సతీమణి పద్మ శుక్రవారం మృతి చెందారు. గత నెల రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌లో చేర్పించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈరోజు తెల్లవారుజామున 4.30 మరణించారు. దాసరి దర్శకత్వం వహించిన పలు సినిమాలకు ఆమె నిర్మాత.  తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.  రేపు ఉదయం మొయినాబాద్ లో దాసరి ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.

ప్రముఖుల సంతాపం
దాసరి పద్మ మృతి పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తమిళనాడు గవర్నర్ రోశయ్యలు సంతాపం తెలిపారు. సినీ ప్రముఖులు రామానాయుడు, రాఘవేంద్రరావు, మురళీమోహన్, మోహన్ బాబు, జయసుధ, ఆర్ నారాయణమూర్తి, అచ్చిరెడ్డి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తదితరులు దాసరిని పరామర్శించి సంతాపం తెలిపారు.



 


No comments:

Post a Comment

Thank you for your comment