వ్యవసాయం
ఉత్తమం, వ్యాపారం మధ్యమం, ఉద్యోగం అధమం, బిచ్చం అధమాధమం అన్నారు మన
పెద్దలు. కానీ ఈ సూత్రాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ వరకు పెద్దగా
పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉద్యోగులకు అత్యంత స్నేహపూరిత
వాతావరణాన్ని కల్పిస్తున్న కంపెనీగా అది ఎంపికయింది. ప్రపంచంలోనే ఉద్యోగం
చేయడానికి అంతకంటే మంచి సంస్థ లేదని తేలింది. కన్సల్టెన్సీ సంస్థ ‘గ్రేట్
ప్లేస్ టు వర్క్ ఇనిస్టిట్యూట్’ రూపొందించిన ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ ది
మొదటి స్థానం. ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ నాలుగో స్థానంతో
సరిపెట్టుకుంది. లిస్టులో ఆసియా దేశాల కంపెనీలకు అసలు చోటే దక్కలేదు.
సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఎస్‌ఏఎస్ రెండో స్థానంలో, నెట్‌వర్క్ స్టోరేజ్
ప్రొవైడర్ నెట్‌యాప్ మూడో స్థానంలో నిల్చాయి.
ఇక మిగతా కంపెనీలు వరుసగా ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్ (5), ఐటీ కంపెనీ సిస్కో
(6), ఆతిథ్య రంగ సంస్థ మారియోట్ (7), మెక్‌డొనాల్డ్స్(8), గృహోపకరణాల
తయారీ సంస్థ కింబర్లీ-క్లార్క్(9), ఎస్‌సీ జాన్సన్(10) జాబితాలో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా కనీసం 5,000 మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలను మాత్రమే ఈ
సర్వేకు ఎంచుకున్నారు. ఉద్యోగుల్లో విశ్వాసం, అభిమానం, స్నేహభావం
పెంపొందించే విధంగా కార్యాలయాలను తీర్చిదిద్దడానికి కంపెనీలు కృషి
చేయడాన్ని ప్రధానాంశంగా పరిగణనలోకి తీసుకున్నారు. సుమారు 25 లక్షల మంది
ఉద్యోగుల అభిప్రాయాల ఆధారంగా ర్యాంకింగ్స్ ఇచ్చారు.
No comments:
Post a Comment
Thank you for your comment