Tuesday, October 25, 2011

తెలంగాణలో టీడీపీ సదస్సులు

తెలంగాణ జిల్లాలలో ఉద్యమ సదస్సులు నిర్వహించాలని తెలుగుదేశం తెలంగాణ ఫోరం నిర్ణయించింది. .  ఈ నెల 28న రంగారెడ్డి జిల్లాలో, 30న ఆదిలాబాద్ లో సదస్సులు నిర్వహిస్తారు. కొండా లక్ష్మణ్ బాపూజీ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు నవంబరు 1న ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు.
టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు విలేకరులతో మాట్లాడారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు, ఉద్యోగులకు కన్నీరే మిగిలిందన్నారు. కెసిఆర్ కు కోట్ల రూపాయలు దండుకునే అవకాశం లభించిందన్నారు. అయితే ఆయన డబ్బు దండుకుంటున్న విషయం తాను మాట్లాడటంలేదని, తెలంగాణ కోసం 600 మంది ప్రణాలు వదిలారని, అది బాధాకరం అన్నారు.
కెసిఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాతే ఉద్యమం బలహీనపడిందన్నారు. పోలవరం టెండరే దీనికంతటికీ కారణం అన్నారు. కెసిఆర్ ఉద్యమాన్ని అమ్మి పోలవరం టెండర్లు దక్కించుకున్నారని ఆరోపించారు. ఆ టెండర్లను రద్దు చేసి, అందులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జోక్యంపై విచారణ జరిపించాలని  డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment

Thank you for your comment