నన్ను, నా తల్లిని చూసి కాంగ్రెస్ భయపడుతోంది, కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న నీచమైన రాజకీయాలను
దేవుడు చూస్తున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన
రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి తెనాలిలో జరిగిన బహిరంగ సభలో జగన్
ప్రసంగించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇప్పటికీ జనం గుండెల్లో
ఉన్నారని అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలుకావడం లేదన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఆర్యోశ్రీని మరుగున పడేసిందన్నారు.పేదవాడి ఆరోగ్యాన్ని కాంగ్రెస్ సర్కారు గాలికొదిలేసిందని అన్నారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావని అన్నారు.
No comments:
Post a Comment
Thank you for your comment