లక్ష్యం.. క్లీన్‌స్వీప్
వైట్‌వాష్‌కు ఉరకలేస్తున్న భారత్
పరువు కోసం ఇంగ్లండ్ ఆరాటం
నేడే ఆఖరి వన్డే
కోల్‌కతా: భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు వన్డేల సిరీస్ చివరి అంకంలో
ప్రవేశించింది! వరుసగా నాలుగు వన్డేలు నెగ్గి ఊపుమీదున్న భారత్ సిరీస్
క్లీన్ స్వీప్‌పై కన్నేయగా... కనీసం ఆఖరి వన్డేలోనైనా గెలిచి పరువు
దక్కించుకోవాలని కుక్ సేన తలపోస్తోంది. మొహాలీ వన్డేతోనే సిరీస్ భారత్
వశమైన సంగతి తెలిసిందే. కాగా, బుధవారం జరగనున్న ఈ నామమాత్రపు ఐదో వన్డే
మ్యాచ్‌కు ఇక్కడి ఈడెన్‌గార్డెన్స్ వేదికగా నిలవనుంది.
ధోనీ సేన సిరీస్ ఆద్యంతం అన్ని రంగాల్లో ఆధిపత్యం చలాయిస్తుండగా, ఇంగ్లండ్... జట్టుగా సమష్టి ఆటతీరు కనబర్చడంలో విఫలమవుతోంది. యువ ఆటగాళ్లు రహానే, కోహ్లీ, రైనా, జడేజా, ఆరోన్, అశ్విన్‌లు అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగపర్చుకోవడం ఆతిథ్య జట్టుకు వరమైంది. సీనియర్లు లేని లోటు కనిపించనీయకుండా ధోనీ కుర్రాళ్లతోనే జట్టును గెలుపుబాట నడిపించడం విశేషం.
ఇంగ్లండ్ విషయానికొస్తే... టాపార్డర్ ఇంకా కుదురుకుందిలేదు, అప్పుడే సిరీస్ ముగింపు దశ కు చేరుకుంది. ఫలితం 0-4తో వెనుకంజ. టర్నింగ్ పిచ్‌లపై స్పిన్నర్లు స్వాన్, సమిత్, బార్త్‌విక్‌లు ప్రభావం చూపలేకపోయారు. ఈ పోరులోనైనా జట్టుగా రాణించాలని ఇంగ్లండ్ శిబిరం భావిస్తోంది. కాగా, ఈ డే/నైట్ వన్డే కోసం స్పోర్టిం గ్ పిచ్ రూపొందించామని క్యూరేటర్ వెల్లడించారు.
జట్లు (అంచనా)
భారత్: ధోనీ (కెప్టెన్/వికెట్‌కీపర్), పార్థివ్/తివారీ, రహానే, గంభీర్, కోహ్లీ, రైనా, జడేజా, ప్రవీణ్, వినయ్, అశ్విన్, ఆరోన్. ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), కీస్వెటర్, ట్రాట్, పీటర్సన్, బొపారా, బెయిర్‌స్టో/బెల్, బ్రేస్నన్, సమిత్, స్వాన్, ఫిన్, మీకర్.
మ్యాచ్‌కు స్పోర్టింగ్ పిచ్
ఈ పోరు కోసం జీవమున్న పిచ్‌ను రూపొందించినట్టు క్యూరేటర్ ప్రబీర్ ముఖర్జీ వెల్లడించారు. బౌన్స్ లభించే ఈ ట్రాక్‌పై పరుగులు సాధించడం సులువేనని ముఖర్జీ చెప్పారు.
వాతావరణం
వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంటుంది. పగటిపూట 32 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుందని, రాత్రివేళ 76 శాతం తేమ ఉంటుందని వాతావరణ నివేదిక వెల్లడిస్తోంది.

No comments:
Post a Comment
Thank you for your comment