మహేష్ బిజినెస్ మెన్ సంచలనాలకు సిద్దమవుతుంది. సంచలనాలు సృష్టించడానికి
కూడా మంచి ముహూర్తం కావాలని అనుకున్నారేమో కాని బిజినెస్ మెన్ దర్శక
నిర్మాతలు ఫస్ట్ లుక్ కోసం కూడా మంచి ముహూర్తం ఖరారు చేశారు. ఇప్పటివరకు
మహేష్ కెరీర్ లోనే ఏ సినిమా చేయనంత ఫాస్ట్ గా బిజినెస్ మెన్ షూటింగ్
జరుగుతుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ చేసిన దూకుడు వంద రోజులకు
మునుపే బిజినెస్ మెన్ బయటకు రానుంది. ముంబాయిలో బిజినెస్ మెన్ షూటింగ్
జరుపుకుంటుంది. సినిమాలో ఎక్కువ భాగం అక్కడే షూట్ చేస్తున్నారు. ఇప్పటికే
మూడు పాటలు కూడా పూర్తయ్యాయి. మహేష్ ఇంకా కొన్ని సన్నివేశాలలో మాత్రమే
నటించాల్సి ఉంది. బిజినెస్ మెన్ కు సంబంధించిన వర్క్ అంతా ఫాస్ట్ గా
జరిగిపోతుంది. ఇప్పటికే ఓవర్ సీస్ రిలీజ్ కు సంబంధించిన బిజినెస్ కంప్లీట్
అయిపొయింది. ఇక బిజినెస్ మెన్ సినిమా ఫస్ట్ లుక్ ను నవంబర్ పదకొండు
(11.11.11 ) నాడు రిలీజ్ చేస్తున్నారు. దాని తరువాత మరో నెల లోనే ఆడియో
రిలీజ్ కూడా జరిగిపోతుంది. సినిమాను సంక్రాంతి బరిలో దింపనున్నారు. అతిధి
తరువాత లాంగ్ గ్యాప్ భరించిన ఫ్యాన్స్ మహేష్ ఇప్పుడు చూపిస్తున్న దూకుడు
చూసి సంబరపడిపోతున్నారు.
No comments:
Post a Comment
Thank you for your comment