ఆజాద్
కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులను గురించి
సోనియాకు వివరించారు. అయితే తెలంగాణాపై నవంబరు మొదటి వారంలో జరగనున్న
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు కాంగ్రెస్
సీనియర్ నేతలు చెబుతున్నారు. మరోవైపు యూపీఏలోని భాగస్వామ్య పక్షాల
అభిప్రాయాలను కూడా సేకరించాలని సోనియా సీనియర్ నేతలు ప్రణబ్, చిదంబరంలకు
సూచించినట్లు తెలుస్తోంది.
సుదీర్ఘకాలం తర్వాత ఈరోజు మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణా మంత్రులు కూడా హాజరుకావడం విశేషం. అయితే ముఖ్యమంత్రి తెలంగాణా మంత్రులకు ఒక ఎగ్జమ్షన్ ఇచ్చారు. తెలంగాణా జిల్లాల్లో నవంబరు 1వ తేదీన రాష్ట్ర అవతరణ వేడుకలను ఆ జిల్లా కలెక్టర్లే నిర్వహిస్తారు. కొందరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారన్న అంశంపై కూడా మంత్రిమండలిలో చర్చ జరిగింది. కాని ముఖ్యమంత్రి దీన్ని తేలిగ్గా కొట్టిపారేశినట్లు సమాచారం. అటువంటి దేమైనా ఉంటే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ, సీనియర్ నేత డిఎస్‌కు చూసుకుంటారని మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఎవరూ రాజీనామా చేయరని సిఎం భరోసా వ్యక్తం చేసినట్లు సమాచారం.
మంత్రి మండలి సమావేశంలో మంత్రి శంకర్రావుపై కూడా పలువురు మంత్రులు ఫిర్యాదు చేశారు. శంకర్రావు ఇష్టమొచ్చినట్లు సిఎల్‌పిలో ప్రెస్ మీట్ పెట్టి మంత్రులను, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవిధంగా ప్రకటనలు చేస్తున్నారని వట్టి వసంతకుమార్‌తో పాటు మరికొందరు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ముఖ్యమంత్రి నవ్వుతూ కొన్ని రోజులు ఓపిక పట్టండి… శంకర్రావు నాన్సెన్స్ మనకుండదని సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. కేబినెట్ మీటింగ్‌కు కూడా శంకర్రావు రాకుండా డుమ్మా కొట్టడం విశేషం.
No comments:
Post a Comment
Thank you for your comment