Sunday, October 30, 2011

తనయుడి కోచింగ్‌కే అజరుద్దీన్ ఎక్కువ సమయం

Mohammed Azharuddinహైదరాబాద్: మోటార్ బైక్ ప్రమాదంలో చిన్న కుమారుడు ఆయాజుద్దీన్‌నో కోల్పోయిన పార్లమెంటు సభ్యుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మొహ్మద్ అజరుద్దీన్ తన పెద్ద కుమారుడి కోసం ఎక్కువ సమయం వెచ్చించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన చిన్న కుమారుడి 40 రోజుల ప్రార్ధనల సందర్భంగా చెప్పారు. పెద్ద కుమారుడు అసదుద్దీన్‌ను మంచి క్రికెటర్‌గా తయారు చేయడానికి అజర్ ఎక్కువ సమయం హైదరాబాదులో ఉండాలని నిర్ణయించుకున్నారు. డిగ్రీ అయిపోయిన తర్వాత అతన్ని తనతో పాటు ఢిల్లీకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు.

అజర్ తన రెండో భార్య సంగీతా బిజలానీతో ముంబైలో స్థిరపడ్డారు. పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాల్సి రావడంతో ఢిల్లీలో కూడా ఎక్కువ సమయం గడుపుతున్నారు. అసద్ బ్యాటింగ్ శైలిని, ఎడమచేతి వాటం స్వింగ్ బౌలింగ్‌ను మెరుగుపరచడానికి తాను ప్రయత్నిస్తానని అజర్ చెప్పారు. 21 ఏళ్ల అసద్‌కు మంచి కోచ్ అవసరం ఉందని, భవిష్యత్తులో అతను ఇండియాకు ఆడుతాడని అజర్ అంటున్నారు. అసద్ కోల్‌కత్తా నైట్ రైడర్స్ సెలెక్షన్ క్యాంపునకు వెళ్లాడు. లండన్‌లోని తన ఇంటికి వెళ్లడానికి ముందు మరో రెండు నెలల పాటు తాను తన కుమారుడు అసద్‌తో హైదరాబాదులో ఉంటానని అజర్ మొదటి భార్య నౌరీన్ చెప్పారు. నౌరీన్ ప్రస్తుతం లండన్‌లో తన మూడో భర్తతో ఉంటోంది.

No comments:

Post a Comment

Thank you for your comment