ఉదయం
ఎనిమిది గంటలకే నగరంలోని అన్ని రైల్వే బుకింగ్ కేంద్రాల వద్ద బాయ్స్ ను
పెట్టి తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకుంటున్న గ్యాంగ్ లకు చెక్ పెట్టే
పనిలో పడింది రైల్వే శాఖ. ఇక నుంచి ఎవరు పడితే వారు తత్కాల్ టిక్కెట్లు
బుక్ చేసుకోవడానికి వీలుండదు. కేవలం ప్రయాణికుల్లో ఒకరు తమ ఐడీ కార్డు
తెస్తేనే తత్కాల్ టిక్కెట్లు ఇవ్వాలని రైల్వే శాఖ నిర్ణయించింది. తత్కాల్
టికెట్ల జారీలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు
చేస్తున్నామని ద.మ. రైల్వే ప్రకటించింది. తత్కాల్ టికెట్లను కొనుగోలు
చేసేందుకు వచ్చే వారు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు కార్డును కలిగి ఉండేలా
నిబంధనను విధించామని, ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య ఏజెంట్లకు ఆస్కారం లేకుండా
ఏర్పాట్లు చేశామని రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఓ ప్రకటనలో
తెలిపారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను ఆ టైంలో సర్వర్ కెపాసిటీ పెంచే చర్యలు
తీసుకుంటామన్నారు.
No comments:
Post a Comment
Thank you for your comment