
దసరాకి ఫస్ట్ లుక్ తో సందడి చేసిన పంజా, దీపావళికి ఫస్ట్ టేస్ట్ చూపించి ఫ్యాన్స్ కి పిచ్చెత్తిస్తోంది. ఇప్పడీ సినిమా గురించి కేవలం అభిమానులు మాత్రమే కాదు ఇటు సెలబ్రిటీస్ కూడా తెగ మాట్లేడేస్తున్నారు. పంజా టీజర్ చూసిన సిద్దార్థ్, నితిన్, హరీష్ శంకర్ తదితరులు పవన్ కళ్యాణ్ ని విపరీతంగా పొగిడేశారు. ఇండస్ట్రీలో ఇప్పుడు పంజా ఎలా వచ్చిందని, ఏ విధంగా ఉండబోతుందని ఆరా తీస్తున్నారు.
మొదట్లో తమిళ దర్శకుడు, క్లాస్ సినిమా వగైరా అంశాల వల్ల ఆసక్తి కలిగించలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు సడన్ గా ఇంతటి క్రేజీ సినిమాగా మారడం నిర్మాతల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పంజా సినిమా పట్ల పెరుగుతున్న ఆసక్తితో నిర్మాతలు ప్రమోషన్ కార్యక్రామాలని మరింతగా పెంచాలని చూస్తున్నారు. యూట్యూబ్ లో టీజర్ వ్యూస్ లక్షల్లో నమోదు కావడం ఈ సినిమా పట్ల ఉన్న క్రేజ్ ఏమిటనేది తెలియజేస్తోంది.
ముప్పయ్ సెకన్ల టీజర్ లో పవన్ కళ్యాణ్ ని మాత్రమే వివిధ యాంగిల్స్ లో చూపించగా, అందులోనే విష్ణువర్ధన్ స్టైయిలిష్ టేకింగ్, యువన్ శంకర్ రాజా ఫెంటాస్టిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా హైలైట్ అయ్యాయి..ఈ టీజర్ చూసిన తర్వాత ‘పంజా’పై అంచానాలు మరింతగా పెగుతున్నాయి. ఇక నవంబర్ 13న విడుదలయ్యే ఆడియో, అదే రోజు విడుదల కానున్న థియేట్రికల్ ట్రైయిలర్స్, సినిమాపై స్పందన వగైరా జత కలిస్తే అంచనాలు అంబరాన్ని అంటుతాయి.
No comments:
Post a Comment
Thank you for your comment