Sunday, October 30, 2011

ట్వంటీ20: భారత్‌ను చితక్కొట్టిన ఇంగ్లాండు

MS Dhoni
కోల్‌కతా: ట్వంటీ20 క్రికెట్ మ్యాచులో ఇంగ్లాండు భారత్‌పై పగ తీర్చుకుంది. భారత్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆట ప్రారంభం నుంచే ఇంగ్లాండు భారత్‌పై ఆధిపత్యం సాధించింది. ఇంగ్లాండు 121 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండు 18.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కెవిన్ పీటర్సన్ 53 పరుగులు చేశాడు. యూసుఫ్ పఠాన్, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా ఒక్కో వికెట్ తీసుకున్నారు. భారత్ కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఇంగ్లాండు బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌ను ఏ సందర్భంలో కూడా నిలదొక్కుకోనీయలేదు.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఇండియా కేవలం 120 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండు బౌలర్ల బంతులకు ఇండియా బ్యాట్స్‌మెన్ చిత్తయ్యారు. మొదటి ఓవర్‌లో వికెట్ తీసి ఇంగ్లాండు భారత్ నడ్డి విరిచింది. బలమైమ బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ భారత్ చేవ ప్రదర్శించలేకపోయింది. సురేష్ రైనా 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీ, రాబిన్ ఊతప్ప, యూసుఫ్ పఠాన్ పెద్దగా పరుగులు సాధించలేకపోయారు. స్టీవెన్ ఫిన్, రవి బొపారా రెండేసి వికెట్లు తీసుకున్నారు. కోహ్లీ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మనోజ్ తీవారీ రైనా తోడుగా నిలిచాడు. వీరిద్దరు కలిసి 40 పరుగులు చేశారు. ఫిన్ ప్రమాదకరమైన సురేష్ రైనా, రవీంద్ర జడేజా వికెట్లు పడగొట్టాడు. కోహ్లీ జోరుగానే ప్రారంభించినప్పటికీ టిమ్ బ్రెస్నన్ స్లో బాల్‌కు వికెట్‌ను జారవిడుచుకున్నాడు. మొదటి రెండు ఓవర్లలో భారత్ ఓపెనర్లు రహనే, రాబిన్ ఊతప్ప అవుటయ్యారు. ధోనీ 21 పరుగులు చేశాడు.

No comments:

Post a Comment

Thank you for your comment