భారతదేశం వివిధ
జాతులకు, మతాలకు పుట్టినిల్లు. అలాంటి భారతదేశంలో అన్ని ఉన్నప్పటికీ
ఫార్ములా వన్ రేసు కొర్టు లేదని ఏదో ఒక మూలన మొన్నిటి వరకు భావన ఉండేదకానీ
ఇప్పుడు ఆ భావన పూర్తిగా తొలగిపోయింది. అందుకు కారణం భారత్‌లో జరిగే తొలి
ఫార్ములావన్ పోటీలకు సర్వం సిద్ధమైంది. గ్రేటర్ నోయిడా లోని బుద్ధ
ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో రేసు సర్క్యూట్ అన్ని హాంగులతో సిద్దమైంది. ఈ
రోజు నుండి మూడు రోజులు(అక్టోబర్ 28, 29, 30) పాటు ప్రపంచంలో ఉన్న గొప్ప
గొప్ప వారంతా ఈ కార్యక్రమానికి వచ్చి సందడి చేయనున్నారు.
శుక్రవారం ప్రాక్టీస్ రేసు జరుగనుంది. శనివారం క్వాలిఫయింగ్ రేసులను నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం ప్రధాన రేసు జరుగనుంది. రేసుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యంత అధునాతనమైన ట్రాక్‌ను రూపొందించారు. జేపీ గ్రూప్ చైర్మన్ మనోజ్ గౌర్, భారత మోటార్ స్పోర్ట్స్ క్లబ్ సమాఖ్య అధ్యక్షుడు విక్కీ చందోక్, భారత తొలి ఫార్ములావన్ డ్రైవర్ నారాయణ్ కార్తీకేయన్‌ల పర్యవేక్షణలో అధునాతన ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. భారత్‌లో జరిగే తొలి ఎఫ్-1 పోటీల కోసం దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను వెచ్చించారు.
ఫార్ములావన్
కోసం నిర్మించిన బుద్ధ సర్క్యూట్ మొత్తం 857 ఎకరాల్లో విస్తరించింది.
ట్రాక్ పొడవు మొత్తం 5.14 కిలోమీటర్లు. ఈ ట్రాక్‌పై 60 ల్యాప్‌లున్నాయి.
జర్మనీకి చెందిన హెర్మాన్ టిల్కె ఈ ట్రాక్‌ను డిజైన్ చేశారు. గతంలో
మలేసియా, షాంఘై, బహ్రెయిన్, వాలెన్సియా తదితర ట్రాక్‌లను ఆయన
రూపొందించారు. ఈ ట్రాక్‌పై గంటకు 210 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే
డ్రైవర్ ఒక నిమిషం 27 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసే వీలుంటుందని మనోజ్
గౌర్ అభిప్రాయపడ్డారు.
ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఫార్ములావన్ బ్రాండ్ అంబాసిడర్ అవతారమెత్తిన మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బాలీవుడ్ స్టార్ షారూక్‌ఖాన్, సహారా ఫోర్స్ ఇండియా యజమాని విజయ్‌మాల్యాలతో సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే నోయిడా చేరుకున్నారు. స్టార్ బాక్సర్ విజేందర్ కూడా ఎఫ్-1 ప్రచార కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు. భారత క్రీడారంగంలో ఇప్పటివరకు క్రికెట్‌కే ఆదరణ ఉండేది..దాన్ని వెనక్కి నెట్టెలా ఖరీదైన ఫార్ములావన్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. హామిల్టన్, షూమకర్, వెటెల్, సుటిల్ తదితర స్టార్ డ్రైవర్లు తమ అద్భుత విన్యాసాలతో అభిమానులను అలరించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇండియాలో మొట్టమొదటి సారి ప్రారంభిస్తున్న ఈ ఫార్ములా వన్ రేసులు దేశ చరిత్రలోనే హాట్టహాసంగా మిగిలిపోయే విధంగా నిర్విహించనున్నామని నిర్వాహాకులు తెలియజేశారు.
శుక్రవారం ప్రాక్టీస్ రేసు జరుగనుంది. శనివారం క్వాలిఫయింగ్ రేసులను నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం ప్రధాన రేసు జరుగనుంది. రేసుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యంత అధునాతనమైన ట్రాక్‌ను రూపొందించారు. జేపీ గ్రూప్ చైర్మన్ మనోజ్ గౌర్, భారత మోటార్ స్పోర్ట్స్ క్లబ్ సమాఖ్య అధ్యక్షుడు విక్కీ చందోక్, భారత తొలి ఫార్ములావన్ డ్రైవర్ నారాయణ్ కార్తీకేయన్‌ల పర్యవేక్షణలో అధునాతన ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. భారత్‌లో జరిగే తొలి ఎఫ్-1 పోటీల కోసం దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను వెచ్చించారు.
ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఫార్ములావన్ బ్రాండ్ అంబాసిడర్ అవతారమెత్తిన మాజీ క్రికెట్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బాలీవుడ్ స్టార్ షారూక్‌ఖాన్, సహారా ఫోర్స్ ఇండియా యజమాని విజయ్‌మాల్యాలతో సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే నోయిడా చేరుకున్నారు. స్టార్ బాక్సర్ విజేందర్ కూడా ఎఫ్-1 ప్రచార కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు. భారత క్రీడారంగంలో ఇప్పటివరకు క్రికెట్‌కే ఆదరణ ఉండేది..దాన్ని వెనక్కి నెట్టెలా ఖరీదైన ఫార్ములావన్ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. హామిల్టన్, షూమకర్, వెటెల్, సుటిల్ తదితర స్టార్ డ్రైవర్లు తమ అద్భుత విన్యాసాలతో అభిమానులను అలరించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇండియాలో మొట్టమొదటి సారి ప్రారంభిస్తున్న ఈ ఫార్ములా వన్ రేసులు దేశ చరిత్రలోనే హాట్టహాసంగా మిగిలిపోయే విధంగా నిర్విహించనున్నామని నిర్వాహాకులు తెలియజేశారు.
No comments:
Post a Comment
Thank you for your comment