Sunday, October 30, 2011

ఢిల్లీలో ప్రపంచ ఉర్దూ మహాసభలు

మౌలానా అబుల్‌కలాం ఆజాద్‌ జయంతి సందర్భంగా ఉర్దూ మహాసభలు జరగనున్నాయి.  నవంబరు 11, 12 తేదీల్లో ’33వ ప్రపంచ ఉర్దూ మహాసభలు’ నిర్వహించనున్నట్లు అఖిల భారత ఉర్దూ విద్యా కమిటీ ఛైర్మన్‌ మహ్మద్‌ జలీల్‌పాషా తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో మహాసభలు జరుగుతాయన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మహాసభల వివరాలను వెల్లడించారు. సభలకు పలువురు కేంద్ర మంత్రులు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, వేయి మంది ప్రతినిధులు హాజరు కానున్నారని వివరించారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్  ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన అసలుపేరు ‘మొహియుద్దీన్ అహ్మద్’, ‘అబుల్ కలాం’ అనేది బిరుదు, ‘ఆజాద్’ కలంపేరు. ఆయన  1888 జనవరి 11 న మక్కాలో జన్మించాడు. ఖిలాఫత్ ఉద్యమంసహాయ నిరాకరణోద్యమంఉప్పు సత్యాగ్రహంక్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు. 1958 ఫిబ్రవరి 22 న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మరణించాడు. 1992లో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించింది.

No comments:

Post a Comment

Thank you for your comment