మారిషస్‌లో
తెలుగు సంబరాలు ఘనంగా జరగనున్నాయి. మారిషస్ ప్రభుత్వ సహాయంతో ఆ నగరంలో
జరిగే ఈ ఉత్సవాల పట్ల ప్రపంచ తెలుగు ప్రజానీకం ఆనందోత్సాహాలను
జరుపుకుంటోంది. మారిషస్ తెలుగు కల్చరల్ సెంటర్ ట్రస్ట్ నిర్వహించే ఈ
ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబరు 8వ తేదీ నుంచి మూడు రోజులపాటు
జరుగుతాయి. తెలుగు విశ్వవిద్యాలయంలోని మండలి వెంకట కృష్ణారావు తెలుగు
అంతర్జాతీయ కేంద్రంలో శనివారం ఆయన కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు
మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాలు
వెల్లడించారు.
ఈ మహాసభలకు వివిధ దేశాల నుంచి 200 మంది ప్రతినిధులు హాజరవుతారని
చెప్పారు. సాంస్కృతిక ప్రదర్శనల కోసం రాష్ట్ర ప్రభుత్వం కళాబృందాలను
పంపేందుకు అంగీకరించిందని తెలిపారు. ఆయా అంశాలపై మాట్లాడేందుకు పరిశోధకులను
పంపాలని తెలుగు విశ్వవిద్యాలయాన్ని కోరామన్నారు. ప్రారంభోత్సవానికి
ముఖ్యమంత్రి లేదా ఉపముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేస్తారని వివరించారు.
బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, సభల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వారు సొంత
ఖర్చులతో రావాల్సి ఉంటుందని, అక్కడ స్థానికంగా ప్రయాణ ఖర్చులు, భోజనం
ఏర్పాట్లను ట్రస్టు చూస్తుందని తెలిపారు.
No comments:
Post a Comment
Thank you for your comment