Monday, October 31, 2011

రాష్ట్ర కాంగ్రెస్ లో మరో చీలిక ?

మేడమ్ ను అపాయింట్ మెంట్ అడగడానికే వణికిపోయే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు ఈ మధ్య తరచూ గొంతు లేపుతున్నారు. వారానికోసారి ఎందుకు సమావేశాలు పెడుతున్నారు? ఏకంగా రాజీనామాలకు ఎందుకు తెగబడుతున్నారు? దీని వెనుక అసలు కారణమేంటి? ఇవి అందరి అనుమానాలు. అయితే, ఈ అనుమానాలకు అర్థం చెప్పే వార్తలు వచ్చాయి. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. అయితే, టీఆర్ ఎస్ కాంగ్రెస్ లో కలిసిపోతే పార్టీ పెట్టడం ద్వారా లాభపడదాం అన్నది తెలంగాణ కాంగ్ నేతల ఆలోచన. ఈ నేపథ్యంలో  కాంగ్రెస్ పార్టీ  నుంచి వేరుపడి కొత్త పార్టీని ఏర్పాటు చేసే దిశలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్యెల్యేలు, ఎంపీలు, మంత్రులు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడేందుకు 20 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఆరుగురు మంత్రులు తమ ప్రయత్నాల్ని ముమ్మరం చేసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించి, టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment

Thank you for your comment