మాస్
మహరాజ్ రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘నిప్పు’ సంచలనాలకు రెడీ అవుతోంది.
దీక్షాసేథ్ హీరోయిన్. గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను
వై.వి.ఎస్.చౌదరి నిర్మిస్తున్నారు. సంక్రాంతి రిలీజ్కు సిద్ధమవుతున్న ఈ
చిత్రంలో డారాజేంద్రప్రసాద్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో
డారాజేంద్రప్రసాద్ ఓ కీలకపాత్రను పోషిస్తున్నారని ఈ సందర్భంగా
వై.వి.ఎస్.చౌదరి ప్రకటించారు. అది ‘ఆ నలుగురు’ పాత్రలా హుందాగా ఉంటుంది.
ఆ పాత్ర సినిమాకే హైలైట్. కామెడీకే హీరోయిజాన్ని తెచ్చిన నటకిరీటి
నటించిన సినిమాల డీవీడీలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ప్రత్యేకించి
తమ ఇళ్లలో దాచుకుంటారు. అంతటి గొప్ప నటుడు తనకు మాత్రమే నప్పే పాత్రలతో
హుందాగా కెరీర్ని సాగిస్తున్నారు.
No comments:
Post a Comment
Thank you for your comment