కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు 20 రోజుల్లో
కూలిపోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్
రావు జోస్యం చెప్పారు. కిరణ్ ప్రభుత్వం ఇప్పటికే మైనారిటీలో ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన 34 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని ఆయన
గుర్తు చేశారు. సర్కారు త్వరలోనే పడిపోయి, రాష్ట్రపతి పాలన వచ్చే
అవకాశముందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు
ఖాయమన్నారు. ప్రతిపక్ష తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై
అవిశ్వాసం పెట్టడానికి వెనుకాడుతున్నారని విమర్శించారు.
No comments:
Post a Comment
Thank you for your comment