తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వలలో
చిక్కుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రెహ్మాన్
విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు వేసిన
పథకంలో కేసీఆర్ చిక్కుకుపోయారన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని పక్కన బెట్టి
కేసీఆర్-చంద్రబాబులు ఎవరి వద్ద ఎంత ఆస్తి ఉందనే అంశంపై
చర్చించుకుంటున్నారని విమర్శించారు. ఆస్తుల గొడవలు పక్కనబెట్టి సకల జనుల
సమ్మెలో పాల్గొన్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు, రైతులు, విద్యార్థులు చేసిన
త్యాగాలపై చర్చిస్తే బాగుంటుందని రెహ్మాన్ సూచించారు.
No comments:
Post a Comment
Thank you for your comment