ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబరు ఒకటో తేదీన మాజీ మంత్రి కోమటి
రెడ్డి వెంకట రెడ్డి చేపట్టనున్న దీక్షకు తెలంగాణలో అన్ని వర్గాల నుంచి
మద్దతు లభిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు
మద్దతు ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని త్యాగం
చేసి తెలంగాణ సాధన కోసం దీక్ష చేస్తున్న కోమటిరెడ్డికి తెలంగాణవాదులు,
ప్రజలు అధిక సంఖ్యలో మద్దతు తెలుపుతూ విజయవంతం చేయాల్సిందిగా కేసీఆర్
ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీక్షకు తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె.కేశవరావు ప్రకటించారు. కేసీఆర్,
కేకేలతోపాటు, తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలు,
విద్యార్థి, వైద్య, ఉపాధ్యాయ, ఆర్టీసీ, లెక్చరర్లు, లాయర్ల జేఏసీలు,
తెలంగాణలోని అన్ని సంఘాలు కోమటిరెడ్డి దీక్షకు మద్దతు పలికాయి.
No comments:
Post a Comment
Thank you for your comment