అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రభుత్వం నెగ్గుతుందని పీసీసి చీఫ్ బొత్స
సత్యనారాయణ అన్నారు. కేసీఆర్ కు అతివిశ్వాసం ఎక్కువైందనీ, కాంగ్రెస్ పార్టీ
టిఆర్ఎస్‌లో విలీనం అవుతుందని ఆయన అనడం హాస్యాస్పదమని అన్నారు.
ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదమేమీ లేదని, పడిపోయే సమస్యే లేదని అన్నారు.
మరోవైపు నవంబర్ మూడో వారంలో శాసనసభ సమావేశాలు జరుగనుండటంతో అప్పుడే
అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి
దయాకరరావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసాన్ని
పూర్తిగా కోల్పోయిందని ఆయన అన్నారు.
No comments:
Post a Comment
Thank you for your comment