ఎదుటి
వారిని తిట్టడానికి మాత్రమే తన నోటిని వాడే రోజా తొలిసారిగా ఓ మంచి
మాట/ఆవేదన చెప్పడానికి వాడింది. ఓ మహిళా నేతగా మహిళ గురించే మాట్లాడింది.
ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్‌గా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ నేత రోజా
మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆమె
ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై
ఉందన్నారు. మహిళలపై దాడులు పెరగడానికి చేతగాని హోం మంత్రి సబితా
ఇంద్రారెడ్డే కారణమన్నారు. హోం మంత్రి ఉన్నా కూడా ‘హోమ్’కే పరిమితమయ్యారని
ఎద్దెవా చేశారు. ఇటువంటి హోం మంత్రి ఉన్నందున సాటి మహిళగా సిగ్గుపడాల్సి
వస్తుందన్నారు.
No comments:
Post a Comment
Thank you for your comment