Sunday, October 30, 2011

‘ఊసరవెల్లి’ ఏవరేజట

ఊసరవెల్లి ప్రివ్యూ షో టాక్ ప్రకారం.. సినిమా ఏవరేజ్. ఫస్టాఫ్ సూపర్ అంటూ ఇంటర్వల్లో ఉత్సాహంగా ఫోన్లు చేసిన అభిమానులు.. సెకండాఫ్ చూశాక నీరసించిపోయారు. ఫస్టాఫ్ లో మూడు పాటలూ బాగుండటం, ముఖ్యంగా ఎన్టీఆర్ దాండియా పాటలో ఇరగదీయడం (వన్ ఆఫ్ ద బెస్ట్ డ్యాన్స్ పెర్ఫామెన్సెస్ ఇన్ ఎన్టీఆర్ కెరీర్ అని ఓ అభిమాని చెప్పాడు).. మంచి ఎంటర్ టైన్ మెంట్ ఉండటంతో సినిమా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు ఉత్సాహంతో కనిపించారు. రఘుబాబుతో కలిసి ఎన్టీఆర్ కామెడీ ఇరగదీసినట్లు చెప్పారు. కానీ సెకండాఫ్ కు సీన్ రివర్సయింది. ద్వితీయార్ధంలో కిక్కున్న పాటల్లేకపోవడం, బోర్ కొట్టించే కథనం, రొటీన్ క్లైమాక్స్.. అన్నీ కలిపి ఊసరవెల్లిని హిట్టుకు తక్కువగా.. ఏవరేజ్ కు ఎక్కువగా నిలబెట్టాయట! సెకండాఫ్ లో హీరో కంటే కూడా హీరోయిన్ కు ప్రాధాన్యం ఎక్కువైందట. ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ పరంగా చూసినా సెకండాఫ్ తేలిపోయినట్లు చెబుతున్నారు. ప్రథమార్ధంలో డిఫరెంట్ టేకింగ్ తో అదరగొట్టిన సురేందర్ రెడ్డి.. సెకండాఫ్ లో తనదైన మార్కు చూపించలేకపోయాడని, రొటీన్ సీన్స్ తో బండి లాగించేశాడని అభిమానులు అన్నారు.

No comments:

Post a Comment

Thank you for your comment